Breaking News

ఓఎంసీ కేసు.. సీబీఐ కోర్టు తీర్పుపై హైకోర్టులో సవాల్


Published on: 19 May 2025 18:10  IST

ఓబులాపురం మైనింగ్ కేసులో నిందితులు తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. ఈ కేసులో సీబీఐ కోర్టు ఇచ్చిన తీర్పను హైకోర్టులో సవాల్ చేశారు నిందితులు. ఇప్పటికే ఈ కేసులో గాలి జనార్దన్ రెడ్డికి సీబీఐ కోర్టు ఏడు సంవత్సరాల జైలు శిక్ష విధించిన విషయం తెలిసిందే. సీబీఐ న్యాయస్థానం ఇచ్చిన తీర్పును కొట్టివేస్తూ బెయిల్ మంజూరు చేయాలని నిందితులు హైకోర్టును కోరారు. నిందితులు దాఖలు చేసిన అప్పీల్ పిటిషన్‌పై ఈ నెల 21న హైకోర్టు విచారించనుంది

Follow us on , &

ఇవీ చదవండి