Breaking News

బోథ్‌ మండలంలో తిరుగుతున్న పెద్దపులి..


Published on: 23 Jun 2025 18:51  IST

ఆదిలాబాద్‌ జిల్లా బోథ్‌ మండలంలో పెద్దపులి (Tiger) సంచారం కలకలం సృష్టించింది. బోథ్‌ మండల సరిహద్దు ప్రాంతంలో పెద్దపులి తిరుగుతున్నట్లు నిర్ధారణ అయింది. ఈ ఏమరకు అటవీ శాఖ అధికారులు ఏర్పాటు చేసిన ట్రాప్‌ కెమెరాల్లో పెద్దపులి కనిపించింది. దానికి రెండేండ్ల వయసు ఉంటుందని గుర్తించారు. దీంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. త్వరలో దానిని పట్టుకుంటామని వెల్లడించారు.కాగా, గత గురువారం బోథ్‌ అతవీ ప్రాంతంలో ఓ దూడపై పెద్దపులి దాడి చేసింది.

Follow us on , &

ఇవీ చదవండి