Breaking News

శ్రీరామనవమి.. సీతమ్మకు ‘సిరిసిల్ల’ బంగారు చీర


Published on: 04 Apr 2025 16:15  IST

శ్రీరామ నవమి సందర్భంగా సిరిసిల్లకు చెందిన నేత కార్మికుడు వెల్ది హరిప్రసాద్‌ ప్రత్యేకంగా పట్టు వస్త్రాలను సిద్ధం చేశారు. పది రోజుల పాటు శ్రమించి నేసిన ఈ పట్టు చీర కొంగుపై భద్రాద్రి ఆలయ మూల విరాట్‌ను నేశారు. శంఖు, చక్ర నామాలు, హనుమంతుడు, గరుత్మంతుడును చీర బోర్డర్‌పై చూడొచ్చు. ‘శ్రీరామ రామ రామేతి’.. శ్లోకం చీరపై 51 సార్లు కనిపిస్తుంది. వన్‌ గ్రామ్‌ గోల్డ్‌ జరీ పట్టుతో రూపొందించిన ఈ ఏడు గజాల చీర బరువు దాదాపు 800 గ్రాములు.

Follow us on , &

ఇవీ చదవండి