Breaking News

బంకర్‌ బస్టర్లతో ఇజ్రాయెల్‌ దాడి


Published on: 27 Jun 2025 18:22  IST

హమాస్‌-ఇజ్రాయెల్‌ల మధ్య ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. తాజాగా లెబనాన్‌లోని హెజ్‌బొల్లా భూగర్భ స్థావరాలే లక్ష్యంగా.. బంకర్‌ బస్టర్‌ బాంబులతో ఇజ్రాయెల్‌ విరుచుకుపడింది. శుక్రవారం తమ వైమానిక దళం లెబనాన్‌లోని పలు పర్వత ప్రాంతాల్లోని ఉగ్రవాద హెజ్‌బొల్లా గ్రూప్ సభ్యుల భూగర్భ స్థావరాలే లక్ష్యంగా వైమానిక దాడులు చేసిందని ఇజ్రాయెల్‌ అధికారులు పేర్కొన్నారు. ఈ దాడుల్లో పలువురు హెజ్‌బొల్లా కీలక స్థావరాలను సైతం ధ్వంసం చేసినట్లు తెలిపారు.

Follow us on , &

ఇవీ చదవండి