Breaking News

డిగ్రీ కోర్స్‌ పరీక్షల రివాల్యుయేషన్ ఫలితాల విడుదల


Published on: 30 Jun 2025 18:10  IST

ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలోని అన్ని డిగ్రీ కోర్సుల పరీక్షల రివాల్యుయేషన్ ఫలితాలను విడుదల చేసినట్లు ఓయూ కంట్రోలర్ ఆఫ్ ది ఎగ్జామినేషన్స్ ప్రొఫెసర్ శశికాంత్ ఒక ప్రకటనలో తెలిపారు. బీఏ, బీబీఏ, బీకాం, బీఎస్సీ, బీఎస్సీ ఆనర్స్ తదితర కోర్సుల నాలుగు, ఆరో సెమిస్టర్ రెగ్యులర్, అన్ని సెమిస్టర్ల బ్యాక్లాగ్ పరీక్షల రివాల్యుయేషన్ ఫలితాలను విడుదల చేశామని వివరించారు. ఈ ఫలితాలను ఓయూ వెబ్‌సైట్‌ www.osmania.ac.inలో అందుబాటులో ఉంచినట్లు పేర్కొన్నారు.

Follow us on , &

ఇవీ చదవండి