Breaking News

డెలివరీ ఏజెంట్‌లా వచ్చి టెకీపై అత్యాచారం


Published on: 04 Jul 2025 17:31  IST

మహారాష్ట్రలోని పుణెలో ఓ అపార్ట్‌మెంటు ఫ్లాటులోకి డెలివరీ ఏజెంటులా వచ్చిన యువకుడు అందులో ఉంటున్న ఐటీ ఉద్యోగురాలి (22)పై అత్యాచారం చేశాడు. నగరంలోని కొంధవా ప్రాంతంలో బుధవారం రాత్రి 7.30 సమయంలో ఈ దారుణం జరిగినట్లు డీసీపీ రాజ్‌కుమార్‌ శిందే తెలిపారు. గంట తర్వాత స్పృహలోకి వచ్చిన బాధితురాలు బంధువులతో  పోలీసులకు ఫిర్యాదు చేశారు. గురువారం నేర స్థలాన్ని పరిశీలించిన పుణె కమిషనర్‌ అమితేశ్‌ కుమార్‌ నిందితుడి పట్టివేతకు ఏర్పాటు చేశామన్నారు.

Follow us on , &

ఇవీ చదవండి