Breaking News

క్లౌడ్‌బరస్ట్‌తో వణికిపోయిన ఢిల్లీ…


Published on: 10 Jul 2025 12:58  IST

భారీ వర్షాలతో ఉత్తర భారతం వణికిపోతోంది. ఢిల్లీ, హర్యానా, హిమాచల్‌ ప్రదేశ్‌, ఉత్తరాఖండ్‌లో క్లౌడ్‌ బరస్ట్‌లు.. ఫ్లాష్‌ ఫ్లడ్స్‌ ప్రజలను అతలాకుతలం చేస్తున్నాయి. రోజురోజుకు అక్కడ మృతుల సంఖ్య పెరుగుతోంది. ఢిల్లీ, హర్యానాలో ఉదయం నుంచి ఎడతెరిపి లేని వర్షం కురిసింది. కుండపోత వర్షం కురవడంతో రోడ్లన్ని జలమయమయ్యాయి. భారీ వర్షానికి హర్యానాలోని చుట్టుపక్కల ప్రాంతాల్లోనూ జనజీవనం అస్తవ్యస్తమైంది. రోడ్లు, వీధులన్నీ నీటితో మునగడంతో ట్రాఫిక్‌జామ్‌లు ఏర్పడ్డాయి.

Follow us on , &

ఇవీ చదవండి