Breaking News

అంత‌రిక్షంలో శుభాన్షు శుక్లా హెయిర్ క‌టింగ్ ..!


Published on: 15 Jul 2025 15:08  IST

భార‌ర‌హిత స్థితిలో హెయిర్ క‌టింగ్ చేసుకున్న తొలి భారతీయుడిగా వ్యోమ‌గామి శుభాన్షు శుక్లా రికార్డు క్రియేట్ చేశారు. అంత‌ర్జాతీయ అంత‌రిక్ష కేంద్రంలో అత‌ను తాజాగా క్షౌరం చేయించుకున్నాడు. ప్ర‌స్తుతం డ్రాగ‌న్ స్పేస్‌క్రాఫ్ట్‌లో భూమికి తిరుగు ప్ర‌యాణ‌మైన ఆయ‌న మ‌రికొన్ని గంట‌ల్లో నేల‌పై దిగ‌నున్నారు. అయితే స్పేస్ స్టేష‌న్‌లో ఉన్న ఆస్ట్రోనాట్ నికోల్ ఆయ‌ర్స్.. గ్రూపు కెప్టెన్ శుక్లాకు హెయిర్ క‌టింగ్ చేశారు. చాన్నాళ్లు క్వారెంటైన్‌లో ఉన్న ఆ వ్యోమ‌గాముల‌కు హెయిర్ క‌టింగ్ చాలా అవ‌స‌ర‌మైంద‌ని నికోల్ తెలిపారు.

Follow us on , &

ఇవీ చదవండి