Breaking News

హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ షేర్‌హోల్డర్లకు బొనాంజా?


Published on: 16 Jul 2025 14:26  IST

ప్రైవేటు రంగానికి చెందిన బ్యాంకింగ్‌ దిగ్గజం హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ బోర్డు జులై 19న భేటీ కాబోతోంది. ఈ సమావేశంలో బోనస్‌ షేర్ల జారీ, మధ్యంతర డివిడెండ్‌పై కీలక నిర్ణయం తీసుకోబోతోంది. ఈ సమావేశంలో బోనస్‌ షేర్ల జారీకి బోర్డు గ్రీన్‌సిగ్నల్‌ ఇస్తే.. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ నుంచి బోనస్‌ షేర్ల జారీ ఇదే తొలిసారి అవుతుంది.ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఏప్రిల్‌- జూన్‌ త్రైమాసికానికి (క్యూ1) ఫలితాల ప్రకటనపై జులై 19న బోర్డు భేటీ కాబోతోందని జూన్‌ 23నే హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ వెల్లడించింది.

Follow us on , &

ఇవీ చదవండి