Breaking News

ఎమ్మెల్యేలకూ డీసీసీ పదవులు!


Published on: 27 Oct 2025 11:54  IST

జిల్లా కాంగ్రెస్‌ అధ్యక్ష (డీసీసీ) పదవులకు ఎమ్మెల్యేలకు కూడా పోటీ పడుతున్నారని టీపీసీసీ చీఫ్‌ మహేశ్‌కుమార్‌గౌడ్‌ తెలిపారు. అయితే స్థానిక పరిస్థితులను బట్టి వారికి ఆ పదవులు వచ్చే అవకాశం ఉంటుందన్నారు. ఇతర పదవుల్లో ఉన్నవారికి డీసీసీ అధ్యక్ష పదవులు ఇవ్వబోమని చెప్పిన విషయం వాస్తవమేనని, కానీ.. ఆ పరిధిలోకి ఎమ్మెల్యేలు రారని అన్నారు.అన్ని అర్హతలు ఉన్నవారికే అవకాశం వస్తుందని స్పష్టం చేశారు. ఆదివారం ఢిల్లీలో తెలంగాణ భవన్‌లో మీడియాతో మహేశ్‌గౌడ్‌ ఇష్టాగోష్ఠిగా మాట్లాడారు.

Follow us on , &

ఇవీ చదవండి