Breaking News

తదుపరి సీజేఐగా జస్టిస్‌ సూర్యకాంత్‌ పేరు..


Published on: 27 Oct 2025 15:35  IST

భారత 53వ ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్‌ సూర్యకాంత్‌ ఎంపికయ్యే అవకాశాలున్నాయి. తదుపరి సీజేఐగా (New CJI) ఆయన పేరును ప్రతిపాదిస్తూ సుప్రీంకోర్టు (Supreme Court) ప్రస్తుత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ బి.ఆర్‌.గవాయ్‌ కేంద్ర న్యాయశాఖకు లేఖ పంపారు. ఈ మేరకు అధికారిక వర్గాలు సోమవారం వెల్లడించాయి.సీజేఐ పదవీ విరమణకు నెల రోజుల ముందుగా తదుపరి ప్రధాన న్యాయమూర్తి నియామక ప్రక్రియను ప్రారంభించడం సంప్రదాయంగా వస్తోంది.

Follow us on , &

ఇవీ చదవండి