Breaking News

తొక్కిసలాట..బాధిత కుటుంబాలను కలిసిన విజయ్‌


Published on: 27 Oct 2025 15:40  IST

కరూర్‌ తొక్కిసలాట ఘటనలో బాధిత కుటుంబాలను నటుడు, టీవీకే పార్టీ అధినేత విజయ్‌ సోమవారం పరామర్శించారు. మహాబలిపురంలోని ఓ రిసార్ట్‌లో బాధిత కుటుంబాలను కలిసిన ఆయన వారిని ఓదార్చారు. వారిని కలిసేందుకు రిసార్ట్‌లో దాదాపు 50 గదులను టీవీకే పార్టీ బుక్‌ చేసింది. పార్టీ ఏర్పాటుచేసిన ప్రత్యేక బస్సుల్లో వారంతా రిసార్ట్‌కు చేరుకున్నారు.మరోవైపు ఈ కేసు దర్యాప్తును సీబీఐ అధికారికంగా తన చేతుల్లోకి తీసుకుంది. నిబంధనల ప్రకారం.. రాష్ట్ర పోలీసుల ఎఫ్‌ఐఆర్‌’ను తిరిగి నమోదు చేసింది.

Follow us on , &

ఇవీ చదవండి