Breaking News

మెగా కాంట్రాక్ట్‌ కోల్పోవడంపై టీసీఎస్‌ స్పష్టత


Published on: 27 Oct 2025 16:05  IST

భారత దిగ్గజ ఐటీ సంస్థ టీసీఎస్‌తో సుదీర్ఘకాలంగా ఉన్న ఒక బిలియన్‌ డాలర్‌ కాంట్రాక్ట్‌ను మార్క్స్‌ అండ్‌ స్పెన్సర్‌ కంపెనీ ముగించుకుంది. సైబర్‌ దాడులకు సంబంధించి టీసీఎస్‌ (TCS) వైఫల్యాల వల్లే ఈ కాంట్రాక్టును ఎం అండ్‌ ఎస్‌ కంపెనీ పునరుద్ధరించలేదని యూకే మీడియా ‘టెలిగ్రాఫ్‌’ కథనం ప్రచురించింది. దీనిపై టీసీఎస్‌ స్పందిస్తూ.. ఆ వార్తలను తోసిపుచ్చింది. అవన్నీ తప్పుడు కథనాలంటూ స్టాక్‌ ఎక్స్ఛేంజీలకు ఇచ్చిన నివేదికలో పేర్కొంది.

Follow us on , &

ఇవీ చదవండి