Breaking News

భారత్‌తో టెస్టు సిరీస్..జట్టును ప్రకటించిన సౌతాఫ్రికా


Published on: 27 Oct 2025 16:19  IST

త్వరలో సౌతాఫ్రికా జట్టు భారత పర్యటనకు రానుంది. టీమ్ఇండియాతో రెండు టెస్టులు, మూడు వన్డేలు, ఐదు టీ20లు ఆడనుంది. నవంబర్ 14 నుంచి కోల్‌కతా, 22 నుంచి గువాహటి వేదికగా టెస్టు మ్యాచ్‌లు జరగనున్నాయి. ఈ సిరీస్‌ టెస్టు కోసం సౌతాఫ్రికా 15 మంది జట్టును ప్రకటించింది. తెంబా బావుమా మళ్లీ జట్టును ముందుండి నడిపించనున్నాడు.పాక్‌తో సిరీస్‌లో పాల్గొన్న చాలా మంది ఆటగాళ్లు ఈ జట్టులో చోటు దక్కించుకున్నారు.

Follow us on , &

ఇవీ చదవండి