Breaking News

ఘోర రోడ్డు ప్రమాదం..స్కూల్‌ పిల్లల ఆటో బోల్తా..


Published on: 10 Dec 2025 18:42  IST

స్కూల్‌ పిల్లలను తీసుకెళ్తున్న ఆటో బోల్తాపడి పదవ తరగతి విద్యార్థి అక్కడికక్కడే మృతిచెందారు. మరో 14 మంది విద్యార్థులకు గాయాలయ్యాయి. కామారెడ్డి జిల్లా జుక్కల్ మండలంలో ఈ ప్రమాదం జరిగింది. మండలంలోని సావర్గావ్ గ్రామం నుంచి ఖండే గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలకు విద్యార్థులను తీసుకెళ్తుండగా ఆటో బోల్తాపడింది.ప్రమాదంలో పదవ తరగతి విద్యార్థి ప్రణవ్ (15) అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. మరో 14 మంది విద్యార్థులు గాయపడ్డారు.

Follow us on , &

ఇవీ చదవండి