Breaking News

నేటి నుంచి గుంటూరు, కుప్పంలో సీఎం పర్యటన


Published on: 30 Jan 2026 16:02  IST

సీఎం చంద్రబాబు రేపటి నుంచి గుంటూరు, కుప్పంలో పర్యటించనున్నారు. గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రిలో మాతాశిశు ఆరోగ్య కేంద్ర భవనాన్ని సీఎం శుక్రవారం ప్రారంభిస్తారు. గుంటూరు మెడికల్‌ కాలేజీ అల్యూమిని ఆఫ్‌ నార్త్‌ అమెరికా(జింకానా) పేరుతో ఈ కాలేజీ పూర్వ విద్యార్థులు రూ.100 కోట్ల విరాళాన్ని అందజేశారు. ఈ కార్యక్రమం అనంతరం ఆదివారం సాయంత్రం వరకు కుప్పంలో సుమారు రూ.690 కోట్ల విలువైన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల్లో సీఎం పాల్గొంటారు. 

Follow us on , &

ఇవీ చదవండి