Breaking News

పెంపుడు కుక్క దాడి.. మహిళకు 50 కుట్లు..


Published on: 31 Jan 2026 10:43  IST

బెంగళూరు HSR లేఅవుట్‌లోని టీచర్స్ కాలనీలో ఒళ్లు గగుర్పొడిచే ఘటన చోటుచేసుకుంది. ఎదురింటి వాళ్ల పెంపుడు కుక్క చేసిన దాడిలో ఒక మహిళ తీవ్రంగా గాయపడింది. ఈ దాడి తీవ్రత ఎంతలా ఉందంటే, ఆమె శరీరానికి ఏకంగా 50కుట్లు వేయాల్సి వచ్చిందని వైద్యులు వెల్లడించారు. ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు సీసీటీవీలో రికార్డయ్యాయి.ఆమెను రక్షించేందుకు ప్రయత్నించిన కుక్క యజమానికీ గాయాలయ్యాయి. ఆమె కోలుకోవడానికి చాలా సమయం పడుతుందని డాక్టర్లు తెలిపారు.

Follow us on , &

ఇవీ చదవండి