Breaking News

ఏలూరు జిల్లాలో మరోసారి పెద్దపులి కలకలం..


Published on: 31 Jan 2026 12:02  IST

ఏలూరు జిల్లాలోని ఏజెన్సీ ప్రాంతాల్లో పెద్దపులి సంచారం స్థానికులకు కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది. పోలవరం ప్రాజెక్టు పరిసర ప్రాంతాల్లో పులి సంచరిస్తోండటంతో ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. పోలవరం మండల పరిసర ప్రాంతంలో పెద్దపులి మళ్లీ పంజా విసిరింది. గత కొన్ని రోజులుగా అటవీ ప్రాంత సరిహద్దుల్లో సంచరిస్తున్న పులి.. తాజగా ఇటుకలకోట గ్రామం వద్ద జనావాసాల్లో ప్రవేశించి ఆరుబయట కట్టేసి ఉన్న రెండు లేగదూడలపై దాడి చేసి చంపేసింది.

Follow us on , &

ఇవీ చదవండి