Breaking News

వైసీపీ ప్రచారం పూర్తిగా అసత్యం: మంత్రి


Published on: 31 Jan 2026 17:14  IST

టీటీడీ లడ్డూ కల్తీ వ్యవహారంలో వైసీపీకి ఎలాంటి క్లీన్చిట్ రాలేదని ఆర్థికశాఖ మంత్రి పయ్యావుల కేశవ్ స్పష్టం చేశారు. వైసీపీ తమకు క్లీన్ చిట్ వచ్చినట్లు చేసుకుం టున్న ప్రచారం పూర్తిగా అసత్యమని, దేవదేవుడి విషయంలో పాపం చేసి సంబరాలు చేసుకోవడానికి ఆ పార్టీ నేతలకు సిగ్గుండాలని విమర్శించారు.2014-19 మధ్య టీడీపీ ప్రభుత్వం స్వామివారి లడ్డూ పవిత్రతను కాపాడేందుకు అనేక పకడ్బందీ నిబంధనలు పెట్టిందని.. కానీ, వైసీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే ఆ నిబంధన లను సడలించి కల్తీకి బీజం వేసిందని అన్నారు.

Follow us on , &

ఇవీ చదవండి