Breaking News

దర్శి మున్సిపల్ కమిషనర్ ఇంట్లో ఏసీబీ సోదాలు..


Published on: 31 Jan 2026 17:22  IST

ప్రకాశం జిల్లా దర్శి మున్సిపల్ కమిషనర్ యాదల మహేశ్వర రావు ఇంట్లో ఏసీబీ అధికారులు(ACB Raids) సోదాలు నిర్వహించారు. శనివారం తెల్లవారుజామున 4 గంటల నుంచి ఏసీబీ సోదాలు చేపట్టింది. దర్శి, నరసరావుపేటలోని మహేశ్వర రావు ఇళ్లలో అధికారులు తనిఖీలు చేస్తున్నారు. అలాగే ఆయన బంధువులు, స్నేహితుల నివాసాల్లోనూ సోదాలు చేపట్టారు. ఆదాయానికి మించి ఆస్తులు కూడగట్టుకున్నారని మున్సిపల్ కమిషనర్‌పై ఆరోపణలు ఉన్నాయి.

Follow us on , &

ఇవీ చదవండి