Breaking News

జమ్మూకశ్మీర్‌లో ఒక్కసారిగా భూకంపం..


Published on: 02 Feb 2026 14:09  IST

జమ్మూకాశ్మీర్‌లో ఒక్కసారిగా భూప్రకంపనలు చెలరేగాయి. సోమవారం ఉదయం ఐదున్నర గంటల సమయంలో భూకంపం సంభవించింది. భూకంపం తీవ్రత రిక్టర్ స్కేలుపై 4.8గా నమోదైనట్లు అధికారులు వెల్లడించారు. శ్రీనగర్‌ సమీపంలోని బుడ్గామ్ జిల్లాలో ఈ భూకంప కేంద్రాన్ని అధికారులు గుర్తించారు. శ్రీనగర్‌, పుల్వామా, షోపియాన్‌, బారాముల్లా ప్రాంతాల్లో భూమి కంపించడంతో ప్రజలు భయంతో ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. మళ్ళీ ప్రకంపనలు వస్తాయేమో అనే భయంతో ప్రజలు రోడ్ల మీదనే ఉండిపోయారు. 

Follow us on , &

ఇవీ చదవండి