Breaking News

సజ్జనార్ పక్షపాతంగా వ్యవహరిస్తున్నారు


Published on: 02 Feb 2026 16:50  IST

ఫోన్ ట్యాపింగ్ విచారణ పూర్తి కాకముందే.. అది అక్రమం అని సజ్జనార్ ప్రకటించడం చట్ట విరుద్ధం అని బీఆర్‌ఎస్ కీలక నేత హరీష్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. హైదరాబాద్ సీపీ, సిట్ చీఫ్‌ అయిన సజ్జనార్ పక్షపాతంగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. పోలీసుల పని దర్యాప్తు మాత్రమేనని, తీర్పులు ఇవ్వడం కాదని హరీష్ రావు హితవు పలికారు ఫోన్ ట్యాపింగ్ అక్రమమా, సక్రమమా అనేది న్యాయస్థానం నిర్ణయిస్తుందని, ముందే తీర్పు ఇచ్చే అధికారం సిట్ చీఫ్‌కు ఎవరిచ్చారని ప్రశ్నించారు

Follow us on , &

ఇవీ చదవండి