Breaking News

ఓట్ల కోసమే ఇందిరమ్మ ఇళ్లు: టీ బీజేపీ చీఫ్


Published on: 02 Feb 2026 18:20  IST

రేవంత్ రెడ్డి సారథ్యంలోని కాంగ్రెస్ ప్రభుత్వంపై తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు ఎన్. రాంచందర్ రావు నిప్పులు చెరిగారు. సోమవారం హైదరాబాద్‌లోని హోటల్ పీపుల్స్ ప్లాజాలో ‘బూటకపు హామీలు - మోసపూరిత వాగ్దానాలు’ అంటూ కాంగ్రెస్ అరాచక, అవినీతి పాలనపై తెలంగాణ బీజేపీ చీఫ్ రాంచందర్ రావు ఛార్జ్‌షీట్ విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్ బూటకపు హామీలు, మోసపూరిత వాగ్దానాలు, సేవ్ తెలంగాణ, ఓట్ బీజేపీ థీమ్‌తో ఈ ఛార్జ్ షీట్‌ను విడుదల చేశామన్నారు.

Follow us on , &

ఇవీ చదవండి