Breaking News

రోగి గొంతులో జలగ..


Published on: 03 Feb 2026 12:38  IST

గత కొద్దిరోజుల నుంచి గొంతు నొప్పితో బాధపడుతు సరిగా ఊపిరి ఆడటం లేదని ఆస్పత్రికి వెళ్లిన సిర్మౌర్ జిల్లా కంగర్ ధర్యార్ గ్రామానికి చెందిన 55 ఏళ్ల సురేశ్ దత్ వ్యక్తికి ఊహించని షాక్ తగిలింది. అతడి గొంతులో జలగ ఉన్న సంగతి బయటపడింది. డాక్టర్లు 20 నిమిషాల పాటు ఎంతో కష్టపడి ఆ జలగను బయటకు తీశారు. ఆ వ్యక్తి ప్రాణాలను కాపాడారు. ఈ సంఘటన హిమాచల్ ప్రదేశ్‌లో ఆలస్యంగా వెలుగుచూసింది. ‘ఆ జలగ ఇంకా కొన్ని రోజులు అక్కడే ఉండి ఉంటే ప్రాణాలు పోయేవి అని డాక్టర్లు అన్నారు.

Follow us on , &

ఇవీ చదవండి