Breaking News

హెచ్‌సీఏలో కీలక పరిణామం..


Published on: 03 Feb 2026 12:41  IST

హైదరాబాద్‌ క్రికెట్‌ సంఘం లో కీలక పరిణామం చోటుచేసుకుంది. ప్రస్తుత హెచ్‌సీఏ అధ్యక్షుడు జగన్మోహన్‌రావుపై అంబుడ్స్‌మన్‌ జస్టిస్‌ సురేశ్‌కుమార్‌ కైత్‌ వేటు వేశారు. ఆయనను తక్షణమే పదవి నుంచి తొలగిస్తున్నట్లు ప్రకటించారు. ఫోర్జరీ పత్రాలతో ఎన్నికల్లో పోటీ చేసి.. నిధుల దుర్వినియోగానికి పాల్పడ్డారన్న ఆరోపణల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. గత ఎన్నికల్లో రెండో స్థానంలో నిలిచిన అమర్‌నాథ్‌ను కొత్త ప్రెసిడెంట్ గా ప్రకటిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.

Follow us on , &

ఇవీ చదవండి