Breaking News

అలా అయితే ఈ దేశం నుంచి వెళ్లిపోండి..


Published on: 03 Feb 2026 15:43  IST

ఇన్‌స్టంట్ మెసేజింగ్ ప్లాట్‌ఫామ్ వాట్సాప్‌పై దేశ సర్వోన్నత న్యాయస్థానం ఆగ్రహం వ్యక్తం చేసింది. వాట్సాప్ ప్రైవసీ పాలసీపై అసహనం వ్యక్తం చేసింది. భారత్‌లో కార్యకలాపాలు సాగించాలంటే ఇక్కడి చట్టాలను పాటించి తీరాల్సిందేనని స్పష్టం చేసింది. ఈ మేరకు వాట్సాప్ మాతృసంస్థ మెటాకు మంగళవారం సుప్రీంకోర్టు తీవ్ర హెచ్చరిక జారీ చేసింది మా దేశ గోప్యతతో మీరు ఆడుకోలేరు. దేశ చట్టాలను పాటించకపోతే భారతదేశం విడిచి వెళ్లాల్సి ఉంటుందని హెచ్చరించారు. 

Follow us on , &

ఇవీ చదవండి