Breaking News

హుస్సేన్ సాగర్‌లో దూకి యువతి ఆత్మహత్య


Published on: 03 Feb 2026 18:42  IST

హైదరాబాద్‌లోని హుస్సేన్ సాగర్‌లో దూకి విజయలక్ష్మి (26) అనే యువతి బలవన్మరణానికి పాల్పడింది. కూకట్‌పల్లి ప్రాంతానికి చెందిన సదరు యువతి ఆత్మహత్యకు గల కారణాలపై పోలీసులు మీడియాకు వెల్లడించారు. విజయలక్ష్మి రెండు రోజుల క్రితం బయటకు వెళ్లి వస్తానని చెప్పి ఇంటి నుంచి వెళ్లింది. ఆమె తిరిగి రాకపోవడంతో ఆందోళన చెందిన కుటుంబ సభ్యులు కూకట్‌పల్లి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేసి గాలింపు చర్యలు చేపట్టారు.

Follow us on , &

ఇవీ చదవండి