Breaking News

రాజమండ్రిలో..స్కూల్ వైపు వెళ్లిన పెద్దపులి..


Published on: 04 Feb 2026 11:34  IST

కొద్ది రోజుల నుంచి రాజమండ్రి పరిసర ప్రాంతాల్లో పెద్దపులి కలకలం సృష్టిస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా, దివాన్ చెరువు సెంటర్ సమీపంలో పెద్దపులి సంచరిస్తూ కనిపించింది. జాతీయ రహదారి పక్కనే ఉన్న ఎస్‌వీపీసీ ఫంక్షన్ హాల్ దగ్గర కూడా జనాలకు కనిపించింది. పెద్ద పులి ఢిల్లీ పబ్లిక్ స్కూల్ వైపు వెళ్లినట్లుగా తెలుస్తోంది. ఓ చోట పెద్దపులి తిరుగుతుండగా కారులో నుంచి కొంతమంది యువకులు వీడియో తీశారు. ఆ వీడియో కాస్తా సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. 

Follow us on , &

ఇవీ చదవండి