Breaking News

పోలీసులను ఆశ్రయించిన ఈషా రెబ్బ..


Published on: 04 Feb 2026 18:12  IST

అచ్చ తెలుగు నటి ఈషా రెబ్బ (Eesha Rebba) పోలీసులను ఆశ్రయించింది. తనపై సోషల్ మీడియాలో ఆసభ్యకరమైన పోస్టులు పెడుతున్న వ్యక్తిపై బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది. ఇన్స్టాగ్రామ్ లో తాను పెట్టే పోస్టుల కింద అసభ్యకరమైన కామెంట్స్ పెడుతున్నాడని, అతడిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరింది. ఇక ఈషా ఫిర్యాదును అందుకున్న పోలీసులు చర్యలు చేపడతామని తెలిపారు. ఇందుకు సంబంధించిన వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

Follow us on , &

ఇవీ చదవండి