Breaking News

దారి మార్చిన పెద్దపులి..


Published on: 04 Feb 2026 18:51  IST

జగదేవ్‌పూర్‌ మండలం దౌలాపూర్‌ అటవీ ప్రాంతం నుంచి బయటకు వచ్చిన పెద్దపులి వరుస గ్రామాల్లో సంచరిస్తూ ప్రజలను కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది. తాజాగా ఈ పులి యాదాద్రి భువనగిరి జిల్లా రాజపేట మండలం బసంతపూర్‌ సమీపంలో ఓ లేగదూడపై దాడి చేసి చంపేసినట్లు అటవీ శాఖ అధికారులు నిర్ధారించారు. పులి కదలికలను నిరంతరం పర్యవేక్షిస్తున్న అధికారులు,తాజాగా జనగామ జిల్లా ఆలేరు మండలం శ్రీనివాసపురం గ్రామ పరిసరాల వైపు పులి వెళ్లినట్లు పాదముద్రల ఆధారంగా గుర్తించారు.

Follow us on , &

ఇవీ చదవండి