Breaking News

4 వారాల్లో తెలంగాణకు డీజీపీని నియమించండి..


Published on: 05 Feb 2026 16:34  IST

నాలుగు వారాల్లోగా తెలంగాణకు పూర్తిస్థాయి డీజీపీ నియామకం పూర్తిచేయాలని యుపీఎస్సీకి సుప్రీంకోర్టు ఆదేశాలు జారీచేసింది. డీజీపీ నియామకానికి యూపీఎస్సీ అత్యవసరంగా సిఫార్సులు చేయాల్సిందేనని ఆదేశించింది. అర్హత కలిగిన అధికారుల జోన్ ఆఫ్ కన్సిడరేషన్‌లో వారి పరస్పర ప్రతిభ (ఇంటర్-సే మెరిట్) ఆధారంగా ఎంపిక జరగాలని పేర్కొంది. ఈ ప్రక్రియను పూర్తి చేయడానికి యూపీఎస్సీకి అదనంగా నాలుగు వారాల గడువు ఇస్తున్నట్లు తెలిపింది.

Follow us on , &

ఇవీ చదవండి