Breaking News

హైదరాబాద్‌లో మరో అగ్నిప్రమాదం..


Published on: 05 Feb 2026 18:47  IST

ముషీరాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలోని గాంధీనగర్‌లో గల ఉమెన్స్ హాస్టల్లో గురువారం అగ్ని ప్రమాదం జరిగింది.ఈ ఘటనపై స్థానికులు అగ్నిమాపక అధికారులు, పోలీసులకు సమాచారం అందజేశారు. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. అదృష్టవశాత్తూ ప్రమాద సమయంలో ఆ వసతి గృహంలో ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది.ఈ అగ్నిప్రమాదం షార్ట్ సర్క్యూట్ వల్ల సంభవించి ఉండవచ్చని పోలీసులు భావిస్తున్నారు.

Follow us on , &

ఇవీ చదవండి