Breaking News

అడ్వకేట్ స్వప్న హత్య కేసులో కీలక పురోగతి..


Published on: 05 Feb 2026 18:48  IST

చేవెళ్ల కోర్టులో ప్రాక్టీస్ చేస్తున్న న్యాయవాది గోటికె స్వప్న హత్య కేసును(Advocate Swapna Case) పోలీసులు ఛేదించారు. అత్యంత పాశవికంగా జరిగిన ఈ హత్యకు సొంత అన్నయ్యే సూత్రధారి అని తేలడం స్థానికంగా కలకలం రేపింది. ఆస్తి కోసం తోడబుట్టిన బంధాన్ని మర్చిపోయి చేసిన ఈ హత్య మొయినాబాద్ ప్రాంతంలో సంచలనంగా మారింది. పోలీసులు.. నిందితులను రిమాండ్‌కు తరలించారు. ఈ కేసుకు సంబంధించిన పూర్తి వివరాలను చేవెళ్ల డీసీపీ యోగేశ్ గౌతమ్ వెల్లడించారు.

Follow us on , &

ఇవీ చదవండి