Breaking News

వేలానికి దివంగత సీఎం జయలలిత ఇల్లు!


Published on: 06 Feb 2026 10:54  IST

దివంగత సీఎం జయలలిత నివాసం ‘వేద నిలయం’ను వేలానికి పెట్టే అవకాశం కనిపిస్తోంది. జయలలిత పెద్ద మొత్తంలో ఆదాయ పన్ను కట్టాల్సి ఉండటంతో.. ఆ శాఖ అధికారులు వేద నిలయాన్ని వేలం వేసేందుకు చూస్తున్నారు. జయలలితకు సంబంధించి ఆదాయ, ఆస్తి పన్నులు రూ.13.69 కోట్ల మేర బకాయిలు ఉన్నాయి. జయలలిత చట్టపరమైన వారసులు ఇప్పటి వరకు రూ.13.69 కోట్లు చెల్లించలేదని తెలుస్తోంది. జయలలిత చెల్లించాల్సిన మొత్తం పన్ను వడ్డీతో సహా రికవరీ చేయాల్సి ఉందన్నారు.

Follow us on , &

ఇవీ చదవండి