Breaking News

బీజేపీ మరింత క్రియాశీలం కావాలి!


Published on: 06 Feb 2026 14:44  IST

తిరుమల లడ్డూ కల్తీ వ్యవహారంలో బీజేపీ కూడా మరింత క్రియాశీలంగా వ్యవహరించాల్సిన అవసరం ఉందని సీఎం చంద్రబాబు అన్నట్లు తెలిసింది. ఇలాంటి అంశాలను బీజేపీ అయితేనే మరింత బలంగా ప్రజల్లోకి తీసుకెళ్లగలదని పేర్కొన్నట్లు సమాచారం. ఉండవల్లి నివాసంలో గురువారం కూటమి నేతలతో ఆయన సుమారు గంటన్నరపాటు చర్చలు జరిపారు. సమావేశంలో తిరుమల లడ్డూ కల్తీ వ్యవహారంపైనే ప్రధానంగా చర్చ జరిగినట్లు సమాచారం.

Follow us on , &

ఇవీ చదవండి