Breaking News

ప్రపంచ కప్ ఫైనల్‌లో వైభవ్ అరుదైన రికార్డ్


Published on: 06 Feb 2026 17:37  IST

శుక్రవారం టైటిల్‌ పోరులో ఇంగ్లాండ్‌తో తలపడుతున్న ఆయుశ్‌ మాత్రే బృందం.. హరారే వేదికగా టాస్‌ గెలిచి తొలుత బ్యాటింగ్‌ ఎంచుకుంది. ఓపెనర్లలో ఆరోన్‌ జార్జ్‌ 9 పరుగులకే పెవిలియన్ చేరాడు. 14 ఏళ్ల సూర్యవంశీ కాసేపు ఇంగ్లీష్ బౌలర్లపై దయచూపి.. ఆ తర్వాత దండయాత్ర చేశాడు. అది మాములు దండయాత్ర కాదు.. దయాగాడి దండయాత్ర అన్నట్లు సాగింది అతడి బ్యాటింగ్. ఫలితంగా తొలి 32 బంతుల్లో అర్ధ శతకం, 55 బంతుల్లో సెంచరీ మార్కును అందుకున్నాడీ చిచ్చర పిడుగు. 

Follow us on , &

ఇవీ చదవండి