Breaking News

తల్లిదండ్రులు మందలించేది మీ బాగు కోసమే


Published on: 06 Feb 2026 18:32  IST

మనిషి వృద్ధిలోకి రావాలంటే తల్లిదండ్రులు, గురువుల మాటలు గౌరవించాలని ప్రభుత్వ సలహాదారు, ప్రవచనకర్త చాగంటి కోటేశ్వరరావు విద్యార్థులకు సూచించారు. ‘విద్యా దీప్తి - సంస్కార స్ఫూర్తి’ కార్యక్రమంలో భాగంగా అడ్డురోడ్డులోని శ్రీఆదర్శ పాఠశాలలో గురువారం సుమారు రెండు వేల మంది విద్యార్థులకు భవిష్యత్తుపై దిశానిర్దేశం చేశారు. తల్లిదండ్రులు మందలిస్తే అది మీ బాగు కోసమేనని విద్యార్థులు గుర్తించాలన్నారు. హోంమంత్రి వంగలపూడి అనిత జ్యోతి వెలిగించి కార్యక్రమాన్ని ప్రారంభించారు.

Follow us on , &

ఇవీ చదవండి