Breaking News

పాకిస్థాన్‌లో భారీ పేలుడు.. 30 మందికి పైగా మృతి


Published on: 06 Feb 2026 18:48  IST

పాకిస్థాన్‌లో భారీ ఆత్మాహుతి దాడి చోటుచేసుకుంది. రాజధాని ఇస్లామాబాద్‌లోని షియాలకు చెందిన ఓ ప్రార్థనా మందిరం దగ్గర జరిగిన ఈ ఘటనలో 30 మందికి పైగా మృతి చెందారు. మరో 160 మందికి పైగా గాయపడినట్లు సమాచారం.ఘటనాస్థలికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టిన రెస్క్యూ బృందాలు.. క్షతగాత్రులను స్థానిక ఆసుపత్రులకు తరలించారు. ఇస్లామాబాద్‌లోని షెహజాద్‌ ప్రాంతంలో ఉన్న ఓ ప్రార్థనా మందిరం గేటు దగ్గరకు చేరుకున్న ఓ సూసైడ్‌ బాంబర్‌.. ఈ దుశ్చర్యకు పాల్పడ్డాడు.

Follow us on , &

ఇవీ చదవండి