Breaking News

ఇష్టం లేకుండా గర్భం కొనసాగించాలని..?


Published on: 06 Feb 2026 18:50  IST

అవాంఛిత గర్భధారణకు సంబంధించి సర్వోన్నత న్యాయస్థానం (Supreme Court) కీలక వ్యాఖ్యలు చేసింది. ఇష్టం లేకుండా గర్భం కొనసాగించాలని ఏ మహిళను ఒత్తిడి చేయలేమని స్పష్టం చేసింది. మైనర్‌గా ఉన్నప్పుడు గర్భవతి అయిన ఓ అమ్మాయి 30 వారాల గర్భాన్ని వైద్యపరంగా తొలగించేందుకు అనుమతినిస్తూ కోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది. ఆమె కేసులో గర్భవిచ్ఛిత్తికి నిరాకరిస్తూ బాంబే హైకోర్టు (Bombay High Court) ఇటీవల ఇచ్చిన ఆదేశాలను సుప్రీం ధర్మాసనం తాజాగా పక్కనపెట్టింది.

Follow us on , &

ఇవీ చదవండి