Breaking News

ఎన్టీఆర్ జిల్లాలో ట్రావెల్స్ బస్సు దగ్ధం..


Published on: 07 Feb 2026 13:29  IST

ఎన్టీఆర్జిల్లా కంచికచర్ల మండలం కీసర సమీపంలోని జాతీయ రహదారిపై శనివారం ఉదయం ఓప్రైవేట్ ట్రావెల్స్ బస్సు అగ్నిప్రమాదానికి గురైంది. హైదరాబాద్ నుంచి విజయవాడకు వెళ్తున్న ఈ బస్సులో ఒక్కసారిగా వెనుక భాగంలో మంటలు వ్యాపించాయి. బస్సు వెనుక నుంచి పొగలు, మంటలు రావడాన్ని గమనించిన డ్రైవర్.వెంటనే అప్రమత్తమయ్యాడు. పరిస్థితి ప్రమాదకరంగా మారుతున్నట్లు అర్థం చేసుకున్న డ్రైవర్.. బస్సును రోడ్డు పక్కకు ఆపి, అందులో ఉన్న ప్రయాణికు లను తక్షణమే కిందకు దించాడు.

Follow us on , &

ఇవీ చదవండి