Breaking News

కబూతర్‌ ఆ.. ఆ.. ఆజా!


Published on: 07 Feb 2026 16:57  IST

భవనం ముందు జనం నిలబడి పైకి చూస్తున్న ఈ చిత్రం రాజస్థాన్‌లోని నాగౌర్‌ జిల్లా డేగానా పట్టణానికి చెందినది. స్థానిక బులియన్‌ మార్కెట్‌లోని నగల దుకాణం నుంచి రూ.లక్ష విలువచేసే బంగారు గొలుసును ముక్కున కరచుకొని భవనంపైకి చేరిన పావురాన్ని జనమంతా ఆసక్తిగా చూశారు. శుక్రవారం జరిగిన ఈ ఘటనతో మార్కెట్లో కాసేపు గందరగోళం నెలకొంది.దుకాణదారులు చాలాసేపు ప్రయత్నాలు చేశాక.. పావురం గొలుసును కిందికి జారవిడిచి తుర్రుమనడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.

Follow us on , &

ఇవీ చదవండి