Breaking News

ట్రేడ్‌ డీల్‌పై కేంద్ర మంత్రి పీయూష్ గోయల్


Published on: 07 Feb 2026 18:31  IST

అమెరికాతో ఇటీవల కుదిరిన మధ్యంతర వాణిజ్య ఒప్పందంపై కేంద్ర వాణిజ్య శాఖా మంత్రి పీయూశ్ గోయల్ స్పందించారు. ఈ ట్రేడ్‌ డీల్‌లో భారత రైతులకు, ఎమ్ఎస్ఎమ్‌ఈ  పరిశ్రమలకు పూర్తి రక్షణలు కల్పించామని చెప్పారు. అదే సమయంలో భారత వ్యవసాయ ఉత్పత్తులను అమెరికాకు ఎగుమతి చేసేందుకూ అవకాశం దక్కిందని అన్నారు. ఎర్రజొన్నలు, వైన్స్, స్పిరిట్స్ వంటి కొన్ని ఎంపిక చేసిన అమెరికా ఉత్పత్తులను మాత్రమే భారత్‌‌లోకి అనుమతించినట్టు తెలిపారు.

Follow us on , &

ఇవీ చదవండి