Breaking News

శ్రీశైలం మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలకు సీఎం


Published on: 07 Feb 2026 18:33  IST

శ్రీశైలం శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి ఆలయంలో రేపటి(ఆదివారం) నుంచి మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి. ఈ ఉత్సవాలకు సీఎం చంద్రబాబును ఆహ్వానించారు ఆలయ అధికారులు. శనివారం సీఎం క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబును ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి, ఆలయ ఛైర్మన్ రమేశ్ నాయుడు, ఈవో శ్రీనివాసరావులు ఆహ్వానించారు. ఈ సందర్భంగా భ్రమరాంబ మల్లికార్జున స్వామి అమ్మవార్ల తీర్థప్రసాదాలను ఆయనకు అందజేశారు అర్చక స్వాములు.

Follow us on , &

ఇవీ చదవండి