Breaking News

తెదేపా జాతీయ అధ్యక్షుడిగా చంద్రబాబు ఏకగ్రీవ ఎన్నిక


Published on: 28 May 2025 18:12  IST

తెదేపా జాతీయ అధ్యక్షుడిగా మరోసారి చంద్రబాబు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ మేరకు మహానాడు వేదికగా పార్టీ ఎన్నికల కమిటీ ఛైర్మన్‌ వర్ల ప్రకటించారు. అనంతరం ఆయన అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఈ సందర్భంగా మంత్రులు, ఎమ్మెల్యేలు, పార్టీనేతలు చంద్రబాబుకు శుభాకాంక్షలు తెలిపారు. 1995లో మొదటి సారిగా చంద్రబాబు పార్టీ పగ్గాలు చేపట్టారు. గత 30 ఏళ్లుగా అధ్యక్ష బాధ్యతలు నిర్వహిస్తున్నారు. తెదేపాలో ప్రతి రెండేళ్ల కోసారి అధ్యక్షుడి ఎన్నిక జరుగుతుంది.

Follow us on , &

ఇవీ చదవండి