Breaking News

66 డివిజన్లుగా కరీంనగర్ ..60 డివిజన్లుగా రామగుండం


Published on: 04 Jun 2025 07:42  IST

కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ ను 60 నుంచి 66 డివిజన్లుగా, రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ ను 50 నుంచి 60 డివిజన్లుగా పునర్విభజన చేస్తూ మున్సిపల్ శాఖ ముసాయిదాను మంగళవారం విడుదల చేసింది. అలాగే 48 వార్డులున్న జగిత్యాల మున్సిపాలిటీలో 50కు పెంచారు. ఉమ్మడి జిల్లాలోని రెండు మున్సిపల్ కార్పొరేషన్లు, ఒక మున్సిపాలిటీలో ముసాయిదాపై ఈ నెల 5 నుంచి 11 వరకు అభ్యంతరాలు, సూచనలు స్వీకరించనున్నారు. వాటిని పరిశీలించి. 17, 18 తేదీల్లో డివిజన్ల విభజనకు కలెక్టర్‌‌‌‌‌‌‌‌ అనుమతి తీసుకోనున్నారు.

Follow us on , &

ఇవీ చదవండి