Breaking News

29 ఏళ్లకే రిటైర్‌మెంట్.. బిగ్ షాక్ ఇచ్చిన లక్నో స్టార్!


Published on: 10 Jun 2025 12:14  IST

కరీబియన్ విధ్వంసక వీరుడు నికోలస్ పూరన్ అనూహ్య నిర్ణయం తీసుకున్నాడు. 29 ఏళ్ల వయసులోనే ఇంటర్నేషనల్ క్రికెట్‌కు గుడ్‌బై చెప్పేశాడీ లక్నో సూపర్ జెయింట్స్ స్టార్. ఇది కఠినమైన నిర్ణయమని ఇన్‌స్టాగ్రామ్‌లో పెట్టిన పోస్ట్‌లో రాసుకొచ్చాడు పూరన్. వెస్టిండీస్ తరఫున 61 వన్డేల్లో 1,983 పరుగులు .. 106 టీ20ల్లో 2,275 పరుగులు చేశాడీ పించ్ హిట్టర్. అంతర్జాతీయ క్రికెట్‌లోకి 2016లో అరంగేట్రం చేశాడు పూరన్. పాకిస్థాన్‌తో జరిగిన టీ20 సిరీస్‌తో డెబ్యూ చేశాడు పూరన్.

Follow us on , &

ఇవీ చదవండి