Breaking News

కేసీఆర్‌ కుటుంబంపై రేవంత్ కీలక వ్యాఖ్యలు


Published on: 11 Jun 2025 15:58  IST

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటన ముగిసింది. కొత్త మంత్రులపై శాఖల కేటాయింపుపై సీఎం స్పష్టత ఇచ్చారు.బుధవారం మీడియాతో నిర్వహించిన చిట్‌చాట్‌లో సీఎం మాట్లాడుతూ.. కేసీఆర్ హయాంలో కొన్ని నెలల వరకు మంత్రి పదవులు ఇవ్వలేదని, ఇచ్చినప్పటికీ శాఖలను కేటాయించలేదన్నారు. తాను మాత్రం రెండు మూడు రోజులకే శాఖలను కేటాయించినట్లు చెప్పారు. తెలంగాణకు కేసీఆర్ కుటుంబ సభ్యులే శత్రువులని, తాను ఉన్నంత వరకు కేసీఆర్ ఫ్యామిలీకి కాంగ్రెస్‌లోకి ఎంట్రీ లేదని కామెంట్స్ చేశారు. 

Follow us on , &

ఇవీ చదవండి