Breaking News

బ్రిక్స్‌కు మద్దతిస్తే 10% అదనపు సుంకం


Published on: 08 Jul 2025 09:56  IST

ఒక పక్క బ్రిక్స్‌ దేశాల సదస్సు బ్రెజిల్‌లో జరుగుతుంటే మరోపక్క అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌ ఈ వాణిజ్య కూటమి పట్ల విషం కక్కారు. బ్రిక్స్‌ అనుసరిస్తున్న అమెరికా వ్యతిరేక విధానాలకు మద్దతుగా నిలిచిన దేశాలపై మరో పదిశాతం అదనపు సుంకాలు విధిస్తానని హెచ్చరించారు. ఇందులో ఎలాంటి మినహాయింపు ఉండబోదని స్పష్టం చేశారు. ఈ మేరకు సోషల్‌ మీడియాలో ఒక పోస్ట్‌ పెట్టారు. ప్రపంచ దేశాలకు వాణిజ్య విధివిధానాలు అధికారికంగా లేఖల రూపంలో పంపిస్తున్నట్లు తెలిపారు.

Follow us on , &

ఇవీ చదవండి