Breaking News

బీజింగ్‌ పరేడ్‌లో రాకాసి అణు క్షిపణి..


Published on: 03 Sep 2025 18:50  IST

చైనా తన అమ్ముల పొదిలోని అత్యాధునిక భారీ అణు క్షిపణిని ప్రపంచం ముందు ప్రదర్శించింది. దీనిని డీఎఫ్‌-5సీగా వ్యవహరిస్తున్నట్లు గ్లోబల్‌ టైమ్స్‌ పేర్కొంది. విక్టరీ డే మిలిటరీ పరేడ్‌ లో ఈ క్షిపణి ప్రపంచాన్ని ఆశ్చర్యానికి గురి చేసింది. ఈ సరికొత్త మిసైల్‌ రేంజిలోకి భూగోళం మొత్తం వస్తుంది. దీని రేంజి 20,000 వేల కిలోమీటర్లకు పైగానే. అంటే ప్రపంచంలో ఎక్కడున్న లక్ష్యాన్నైనా ఇది ధ్వంసం చేయగలదు. అత్యాధునిక గగనతల రక్షణ వ్యవస్థలను ఛేదించుకొని వెళ్లగలదని చెబుతున్నారు.

Follow us on , &

ఇవీ చదవండి