Breaking News

తిరుమల నడకదారిలో ఇనుప కంచె ఏర్పాటు


Published on: 04 Sep 2025 14:29  IST

అలిపిరి నుంచి తిరుమలకు వెళ్లే నడక దారిలో శ్రీవారి భక్తులను వన్యమృగాల దాడుల నుంచి కాపాడేందుకు తీసుకోవాల్సిన చర్యలపై హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. వైల్డ్‌లైఫ్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఇండియా-WII, అటవీ శాఖ, TTD అధికారుల సంయుక్త కమిటీ చేసిన సిఫార్సులను నవంబరులోగా అమలు చేసేందుకు చర్యలు తీసుకోవాలని TTD ఈవోకి హైకోర్టు స్పష్టం చేసింది. సిఫార్సులను ఏ మేరకు అమలు చేశారో తేల్చే బాధ్యతను సంయుక్త కమిటీకి అప్పగిస్తామని చెప్పింది.

Follow us on , &

ఇవీ చదవండి